ముగించు

పలుగు చేతబట్టి.. ఉపాధి కూలి గా మారిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

ప్రచురణ తేది : 12/06/2020

పలుగు చేతబట్టి.. ఉపాధి కూలి గా మారిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు

పలుగు చేతబట్టి.. ఉపాధి కూలీగా మారారు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.. ఉపాధి కూలీలతో పాటే పక్కన కూర్చుని వారిలో ఒకరుగా కలిసిపోయారు.
మాటామంతి కలిపి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు.. సమస్యలు పరిష్కరిస్తామని వారిలో ఆత్మస్థైర్యం నింపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తామని భరోసా నిచ్చారు.. గురువారం బత్తలపల్లి మండలం వేల్పుమడుగు గ్రామం వద్ద చేపడుతున్న ఉపాధి హామీ పనుల ను జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి తనిఖీ చేసిన సమయంలో కనిపించిన దృశ్యాలివి.

NREGS