• సోషల్ మీడియా లింకులు
  • సైట్ మ్యాప్
  • ప్రాప్యత లింకులు
  • తెలుగు
ముగించు

ఆసక్తి ఉన్న స్థలాలు

 

కసాపురము

నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి దగ్గర్లోని కసాపురం అనే గ్రామంలో ఉంది. కన్నడలో నెట్టె అంటే నేరుగా అని అర్థం. నెట్టె కంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం. ఈ కసాపురంలో స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. అందువల్లే మనం కుడి కన్నును మాత్రం చూడలం. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తమనే చూస్తున్నట్లు ప్రతి ఒక భక్తుడికి అనిపిస్తుంది. అందుకే ఇక్కడ స్వామివారిని నెట్టెకంటి ఆంజనేయస్వామి అని అంటారు. ప్రతి ఏడాది నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్దీక్షలు తీసుకుంటారు. హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. ఇందులో బస చేయడానికి అవసరమైన వసతి సౌకర్యాలు ఉన్నాయి..

kasapuram-atp
ఆలూరు కోన

ఆలూరు కోన

: అనంతపురానికి 67 కిమీల దూరంలో ఉంది. ప్రకృతి ప్రియులకు ఈ ప్రాంతం భలే నచ్చేస్తుంది. కొండ పైభాగాన 400 ఏళ్లకు పైబడిన చరిత్ర గల హజీ వలీ దర్గా ఉంది. ఇక్కడి జలపాతాలు పర్యాటకులను ఆహ్లాదాన్ని అందిస్తాయి. ఇక్కడి ఆలూరు రంగనాయక స్వామి దేవాలయం కూడా చూడదగినది.

గుత్తి కోట

గుత్తి కోట: అనంతపురానికి 50 కిమీల దూరంలో ఉన్న ఈ కోట లోపల నగరేశ్వరస్వామి, యల్లమ్మగుడి, శ్రీలక్ష్మీ నరసింహస్వామి, సత్యమ్మ, వేణుగోపాల స్వామి, శ్రీరామదేవాలయాలున్నాయి. కోట గోడలపై విజయనగర రాజుల విజయ చిహ్నం, గజలక్ష్మి ఆకృతులను చూడొచ్చు. మూడు కొండల మధ్య ఉన్న లోయలో ఈ ప్రాంతం ఉంది. కోటలో మంచి నీరు కోసం అప్పట్లో నూటొక్క బావులను తవ్వించారు

గుత్తి కోట
రామలింగేశ్వరరావు-ఆలయం-పూర్తి-గోపురము

తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర ఆలయం

బుగ్గ రామలింగేశ్వర ఆలయం మరియ చింతాల వెంకట రమణ దేవాలయం : రెండో కాశీ క్షేత్రంగా పేరొందిన ఈ ఆలయం తాడిపత్రిలో ఉంది. రాయల కాలానికి ముందు జైన సామంత రాజు ఉదయాదిత్యుడు క్రీ..శ.. 1199లో ఇక్కడ పాలన చేసినట్లు దేవాలయ శిలాశాసనంలో ఉంది. ఈ ఆలయానికి సమీపంలోనే చింతాల వెంకట రమణ దేవాలయం ఉంది.

 

జంబు ద్విపా

జంబు ద్విపా యొక్క జైన పౌరాణిక కాస్మోగ్రాఫికల్ రేఖాచిత్రం వజ్రకూర్ మండలంలోని కోనకొండ్ల గ్రామంలో కొండపై రసవాదుల మీద చెక్కబడి ఉంది, దీనిని శ్రీ ఆర్.వి. 1966 లో కొనకొండ్ల పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ చక్రవర్తి. యాత్రికులు, ముఖ్యంగా దక్షిణ భారత జైన యాత్రికులు ఎక్కువగా ఆకర్షించబడ్డారు ఈ జంబు ద్వీపం అనంతపూర్ నుండి 70 కిలోమీటర్లు లేదా గుంటకల్ రైల్వే స్టేషన్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి ప్రక్కనే కంబం నరసింహ స్వామి కొండలు, రససిద్ద కొండ, కారి బసప్ప కొండ ఉన్నాయి. రససిద్ద కొండపై తీర్థంకరుల (ప్రధాన యాజకులు) విగ్రహాలతో తీర్థంక ఆలయం ఉంది. ఇది 13 వ శతాబ్దానికి చెందిన A.D.

జంబు ద్విపా

గూగూడు కుళ్లాయిస్వామి

గూగూడు కుళ్లాయిస్వామి : అనంతపురం జిల్లా, నార్పల మండలంలో గూగూడు కుళ్లాయిస్వామి దేవాలయం ఉంది. అనంతపురం నుంచి ఇక్కడకు 34 కిలోమీటర్లు. మొహర్రం ఉత్సవాలకు గూగూడు కుళ్లాయిస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఉత్సవాలకు ముఖ్యంగా అగ్నిగుండం ప్రవేశం రోజున స్వామివారి దర్శనం కోసం గూగూడుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ మరో విశేషం ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి దేవాలయాలు పక్కపక్కనే ఉంటూ మత సామరస్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. గుహుడు తపస్సు చేసిన ఈ ప్రాంతమే కాలక్రమంలో గూగూడుగా మారిందని తెలుస్తోంది. అటు పై ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికివేలమందిఇక్కడికివస్తుంటారు